Homeవార్తలుదూరదర్శని నుంచి  లిరికల్‌ వీడియో 

దూరదర్శని నుంచి  లిరికల్‌ వీడియో 

దూరదర్శని నుంచి  లిరికల్‌ వీడియో 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ’దూరదర్శని’. కలిపింది ఇద్దరిని అనేది ఉపశీర్షిక.  కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు నానీడ వెళుతుందా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌కు కూడా అనూహ్యమైన ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి  అనే లిరికల్ వీడియోను పాన్‌ ఇండియా దర్శకుడు పుష్ప, పుష్ప-2 చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు.  సింధుజ, శ్రీనివాసన్‌  ఆలపించిన ఈ బ్యూటిఫుల్‌సాంగ్‌కు సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు. ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా హీరో సువిక్షిత్‌ నా రూపం వచ్చేటట్లు  వరిపొలంలో ఫామింగ్‌ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి  సినిమా అంటే పాషన్‌. సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి’ అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ
“ నా అభిమాన దర్శకుడు, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌ చేతుల మీదుగా మా సాంగ్‌ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. తాజాగా విడుదలైన ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది.1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు. సువిక్షిత్‌ బొజ్జ, గీతిర రతన్‌, భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్‌, జి.భాస్కర్‌, భద్రమ్‌, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: నారాయాణ ఆవుల, డైలాగ్స్‌: కాకర్ల చరణ్‌, లక్ష్మణ్‌.కె, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జె.సుబ్బారెడ్డి, సంగీతం: ఆనంద్‌ గుర్రాన, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు (Story:దూరదర్శని నుంచి  లిరికల్‌ వీడియో )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!