పేద పిల్లలకు విద్యను అందించడం శివశక్తి సంకల్పం ప్రభుత్వ
పేద విద్యార్థులను శివశక్తి ఫౌండేషన్ ఆదుకుంటుంది
న్యూస్ తెలుగు/వినుకొండ : విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందించే సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ముందుకు సాగటం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. గురువారం స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో చీఫ్ విప్ సతీమణి, ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అధ్యక్షతన మెప్మా ఆర్పీల సమావేశం జరిగింది. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పీ మహిళలకు ఏర్పాటుచేసిన చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్నివిధాలా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో సిఎం చంద్రబాబు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారని, కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకై సహాయం చేయడంలో లీలావతి ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన సూచించారు. ఫౌండేషన్ చైర్మన్ లీలావతి మాట్లాడుతూ విద్యలో ప్రతి పని కనబరిచి రాణించే పేద విద్యార్థులకు ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తుందన్నారు. పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొస్తే శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. తక్కువ జీతంతో కష్టపడి పనిచేస్తున్న మెప్మా ఆర్పీ మహిళలు ధైర్యంగా ఉండాలని, మీ పిల్లలకు మంచి విద్యను అందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని, ఉన్నత విద్యకై ఫౌండేషన్ తగిన సాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నరసరావుపేట ఆర్డీవో మధులత మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, క్లస్టర్ ఇంచార్జ్ పివి సురేష్ బాబు మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.(Story :పేద పిల్లలకు విద్యను అందించడం శివశక్తి సంకల్పం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి )