ప్రముఖ ప్రజా కళాకారులు అన్నవరపు రాములు ( 90 ) మృతి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గాను ఒక నటుడిగా, కళాకారుడిగా సుదీర్ఘకాలం ప్రజా కళాకారుడుగా పనిచేసే వృద్ధాప్యంతో గురువారం అన్నవరపు రాములు (90) మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని గురువారం వినుకొండ ఏరియా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జునరావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సోడాల పుల్లయ్య, షేక్ మస్తాన్ హాజరై రాములు భౌతికాయానికి ఘనంగా నివాళులర్పించారు. రాములతో కలిసి గుంటూరు, ప్రకాశం జిల్లాలో భాగవతం నృత్య నాటిక ప్రదర్శించిన ఆయన తోటి కళాకారులు సీనియర్ న్యాయవాది పి జె. లూకా, రాయబారం వందనం ఆయనకు నివాళులర్పించారు. అన్నవరపు రాములు వినుకొండ ప్రాంతంలో కళాకారుడు గానే గాక నాలుగవ తరగతి ఉద్యోగ సంఘానికి చాలా కాలం నాయకత్వం వహించారు. ఆయన గతంలో వినుకొండలోని ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. పలు సందర్భాలలో ప్రజా కళాకారుడిగా, సాంఘిక నాటకాలలో దర్శకుడిగా, నటుడిగా ఆయన అవార్డులు పొందారు. ఈయన మృతికి భూ భాగవతం నృత్యం నాటిక గాయకులు బి. బాచి, తోటి కళాకారులు తమ సంతాపాన్ని తెలిపారు.(Story : ప్రముఖ ప్రజా కళాకారులు అన్నవరపు రాములు ( 90 ) మృతి )