భారతమాత కళ కీర్తి సమాన్ కు ఎంపికైన ప్రసాద్
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ కు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాదరావు కు రాజస్థాన్ కు చెందిన కళ కంజి ఫౌండేషన్ వారు భారతమాత కళ కీర్తి సమాన్ అవార్డుకు ఎంపిక అయ్యారు. దానికి సంబంధించిన ఫోటో మరియు షీల్డ్ సర్టిఫికెట్ గురువారం అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్యోతి లలిత కళ అకాడమీ వారు ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ నిర్వహించగా ఆన్లైన్లో 650 మంది పాల్గొనగా పదిమందికి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. మన ప్రసాదుకు పది మందిలో రెండవ స్థానం దక్కిందని ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, తోటి కళాకారులు, వ్యాపారస్తులు ప్రసాదును మెచ్చుకొని అభినందనలు తెలిపారు.(Story : భారతమాత కళ కీర్తి సమాన్ కు ఎంపికైన ప్రసాద్ )