కాంగ్రెస్ పార్టీనీ నిందిస్తే..బి.జె.పీకి నొప్పి పుడుతుంది
గోపాల్ పేట మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : బి.జె.పి,కాంగ్రెస్ పార్టీలు చీకటి స్నేహం చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం గోపాల్ పేట మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు బి.బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రనికి అండ కెసిఆర్ గులాబీ జెండా అని అందుకే తెలంగాణ అస్థిత్వం కాపాడేది కె.సి.ఆర్ అని అన్నారు. పాలమూరు ముద్దుబిడ్డను అని చెప్పుకొనే రేవంత్ రెడ్డి కేవలం 600కోట్లు ఖర్చు పెడితే 12లక్షల ఎకరాలకు సాగు నీళ్ళు ఇవ్వవచ్చని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ ఏర్పాటులో నిబంధనలు పాటించకుండా కాంగ్రెస్ ఆర్భాటం చేస్తున్నారు. మండలంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలంటే ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తారు దాని తరవాత తుది నోటిఫికేషన్ తర్వాత గెజిట్ వస్తుంది ఈ నిబంధనలు పాటించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి శంకుస్థాన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని కరెంట్ కోతలు,సాగు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులకు రుణమాఫీ లేదని,రైతు భరోసా లేదని,రైతు బీమా లేదని,యువకులకు 2లక్షల ఉద్యోగాలు లేవని,మహిళలకు 2500లేవని,తులం బంగారం లేదని,రైతు కూలీలకు 12000 లేవని,
రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని భూముల ధరలు సగానికి పడిపోయాయని జీవనాధారం కోల్పోయి రియల్టర్స్,మధ్యవర్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కె.సి.ఆర్ రజతోత్సవ సభకు సంకల్పించారని లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచారు.
ప్రతి గ్రామములో సమావేశాలు ఏర్పాటు చేసుకొని గులాబీ జెండా ఆవిష్కరణ చేసి బయలుదేరాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,బి.బాలరాజు,మాజీ ఎం.పి.పి సంధ్య తిరుపతయ్య,చంద్రశేఖర్,శేఖర్,తిరుపతి రెడ్డి,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు,మతీన్,సయ్యద్. జెమీల్,సునీల్ వాల్మీకి,రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (Story:కాంగ్రెస్ పార్టీనీ నిందిస్తే..బి.జె.పీకి నొప్పి పుడుతుంది)