వరి ధాన్యం పంటను ప్రభుత్వ కొనుగోలు
కేంద్రాల్లోనే అమ్మాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రైతులు పండించిన వరి ధాన్యం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రభుత్వం ఇస్తున్న క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లబ్ది పొందాలని వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి వరి ధాన్యపు గింజను ప్రభుత్వం మద్దతు ధర తో కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని అందువల్ల రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపిపి కిచ్చా రెడ్డి, మాజీ ఎంపిపి శంకర్ నాయక్, రైతులు పాల్గొన్నారు. (Story :వరి ధాన్యం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి)