Homeవార్తలుఏప్రిల్ 20న  'కుబేర' 

ఏప్రిల్ 20న  ‘కుబేర’ 

ఏప్రిల్ 20న  ‘కుబేర’ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో శేఖర్ కమ్ముల కుబేర భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచింది.

శేఖర్ కమ్ముల సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. ఆయన సినిమాల మ్యూజిక్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.
శేఖర్ కమ్ముల కుబేర కూడా మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ ఆల్బమ్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సినిమా కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న శేఖర్ కమ్ముల కుబేర ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతోంది. రేపు ప్రోమో రిలీజ్ చేస్తారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ విజలేస్తూ డ్యాన్స్ చేయడం అదిరిపోయింది.

క్యారెక్టర్ బేస్డ్ నరేటివ్స్ తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ గా తీర్చిదిద్దారు, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

శేఖర్ కమ్ముల కుబేర జూన్ 20, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (Story:ఏప్రిల్ 20న  ‘కుబేర’ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!