Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వక్ఫ్ బిల్లు సవరణ కోరుతూ ముస్లిం మైనార్టీల భారీ ర్యాలీ..

వక్ఫ్ బిల్లు సవరణ కోరుతూ ముస్లిం మైనార్టీల భారీ ర్యాలీ..

వక్ఫ్ బిల్లు సవరణ కోరుతూ

ముస్లిం మైనార్టీల భారీ ర్యాలీ..

న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలో సోమవారం వక్ఫ్ బోర్డు చట్టం-2025 ను కేంద్రం రద్దు చేయాలని కోరుతూ ముస్లిం మైనారిటీలు ఒక చేత జాతీయ జెండా, మరో చేత నల్ల జెండాలు పట్టుకొని పట్టణంలోని ప్రధాన విధులలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ. వక్ఫ్ బోర్డు చట్టాలు ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్నాయని ఈ చట్టాల వల్ల వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనివల్ల ముస్లిం సమాజం నష్టపోతోందని వారు ఆవేదన వెలిబుచ్చారు. (Story :వక్ఫ్ బిల్లు సవరణ కోరుతూ ముస్లిం మైనార్టీల భారీ ర్యాలీ..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!