విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అభినందనీయం
అగ్నిమాపక మాపక వారోత్సవాల గోడపత్రికలు విడుదల
జిల్లా జడ్జి జి. శ్రీనివాసులు
న్యూస్‌తెలుగు/అనంతపురం : విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అభినందనీయమని, అగ్నిమాక అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గోడపత్రికలను జిల్లా జడ్జి జి. శ్రీనివాసులు విడుదల చేశారు. స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏ డి ఎఫ్ ఓ లింగమయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి జి.శ్రీనివాసులు , ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ముందుగా 2024 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదాలలో ఫైర్ ఫైటింగ్ చేస్తూ మరణించిన అగ్నిమాపక అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ… ఫైర్ సర్వీస్ సభ్యులు అగ్ని తీవ్రతను తగ్గించడంలో కానీ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో గాని రెస్క్యూ ఆపరేషన్స్ చేయడంలో కానీ మంచి నైపుణ్యతను కనపర్చారన్నారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారిఎం. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై డాక్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన వారిని స్మరించుకుంటూ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అగ్నిమాపక సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి వి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ఈ వారోత్సవాల్లో భాగంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఎలా నివారించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ డెమో ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే సప్రదించవలసిన నంబర్స్ 101, 08554-220299,9963739592 సంప్రదించాలని కోరారు.. అనంతరం ముఖ్య అతిథుల చేత అగ్నిమాపక వారోత్సవాలు గోడపత్రికలు, కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో ప్ల కార్డులు మరియు బ్యానర్లు పట్టుకొని అగ్నిమాపక శకటాలతో అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంచడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫైర్ సర్వీస్ సిబ్బంది, విశ్రాంత సిబ్బంది మరియు అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. .
ఈ కార్యక్రమంలో ట్రేల్లిస్ స్కూల్ విద్యార్థులు, బాలాజీ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినిలు, ఎస్ ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ప్రజలు మరియు అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story :విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అభినందనీయం)