అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
న్యూస్ తెలుగు/సాలూరు : అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి గిరిజన నియోజకవర్గంలో దళితులు గిరిజనుల పై వేధింపులు చేస్తూ దళితుల ఉద్యోగస్తుల సస్పెండ్ చేయడం మే ఈ కుటమీ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్న దొర అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా సాలూరు మున్సిపాలిటీ బంగారమ్మ పేట, పి ఎన్ బొడ్డవలస, పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోసురు లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మనదేశాన్ని తీర్చిదిద్దడంలో డా.అంబేద్కర్ కృషి ఎనలేనిద అని పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రచించి మార్గదర్శిగా రాజ్యాంగం నిలవడానికి ప్రధాన కారకులు అంబేడ్కర్ అని అన్నారు. ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. అంబేడ్కర్ న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను వెలకట్టలేనివని కొనియాడారు. ఈరోజు దేశంలో హరిజనులు ,గిరిజనులు, బిసిలు , అగ్రవర్ణ పేదలు రాజ్యాంగ పదవులు ఉన్నత చదువులు ఉద్యోగాలు అనుభవిస్తున్నారంటే దీనికి కారణం ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగమే అని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కుటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దళితులు, హరిజనులు, గిరిజనులు, మైనార్టీలు,బడుగు బలహీన వర్గాల వారిపై దాడులు చేస్తూ వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గిరిజన శాఖ మంత్రి నియోజకవర్గంలో ఉద్యోగస్తులను సస్పెండ్లు చేయడం వారిని తొలగించడం జరుగుతుందని అన్నారు. హరిజన, గిరిజన సర్పంచుల గ్రామాలలో వారికి పనులు ఇవ్వకుండా రాజ్యాంగ పదవులలో లేని వ్యక్తులకు అభివృద్ధి పనులు ఇవ్వడం జరుగుతుందని ఇది న్యాయంగా ఉందా అని గిరిజన శాఖ మంత్రిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గిరి రఘు, సింగారపు ఈశ్వరరావు, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, డోలు బాబ్జి, గండేపల్లి రాము, గొట్టాపు ముత్యాల నాయుడు, తీగల బలరాం, నెమలి పిట్ట కళ్యాణ్, పీడిక సుధా, పిరిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. (Story :అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి)