ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
న్యూస్‌తెలుగు/అనంతపురం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తి లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ మాట్లాడుతు లెజెండరీ వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన అణగారిన వర్గాలకోసం అహర్నిశలు శ్రమించారు అని, విశ్వ మేధావి అయిన భారతరత్న అంబేద్కర్ జయంతిని భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ మరియు ఐక్యరాజ్య సమితి కూడా ఈ వేడుకలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య వచ్చిన మన భారత రాజ్యంగం మార్గం చూపుతోందని అలాంటి రాజ్యంగాన్ని అంబేద్కర్ మనకు అందించి రాజ్యంగా నిర్మాత అయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు జయలక్ష్మి, విష్ణుప్రియ, రామకృష్ణ అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులను విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి)