ఘనంగా డాIIబీఆర్ అంబేద్కర్ జయంతి
న్యూస్ తెలుగు/చింతూరు: ప్రజాస్వామ్య పరిరక్షకుడు డా :బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమం చింతూరు దళిత కుంటుంబం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లాడే శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ విచ్చేసి అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఎస్సై మాట్లాడుతూ ఒక ఏజెన్సీ ప్రాంతంలో డా:బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని,ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు కృషి చేయాలని, అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడుచుచుకొని ఉన్నంతగమైన చదువులు చదువుకొని ఉన్నత స్థాయిని అధిరోహించాలని,యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని సూచించారు. తదుపరి సీపీఎం పార్టీ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డా:బీఆర్ అంబెడ్కర్ రిజర్వేషన్ల సృష్టించి అందరి ఎదుగుదలకు కృషి చేసారని,అయన అన్ని వర్గాల ప్రజలుకు న్యాయం చేకూరలా రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. అనంతరం సంఘ సభ్యులు చదలవాడ కృపాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజానీకానికి దేవుడు వంటి వారని,అంబేద్కర్ ఆశయాలు అమలు జరిగేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు దళిత కుటుంబం సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు వసంత,మహిళా ఉపాధ్యక్షురాలు నాగమణి,ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కుమార్,నాగేంద్ర, గ్రామీణ వైద్యులు సాగర్,పసుపులేటి సాల్మాన్ రాజు,నక్కా రజని కుమార్,గుండెపోగు శ్రీనివాసరావు, భాస్కర స్కూల్ కరస్పండెంట్ చీరసాని వేణు గోపాల్,ఊబా హరవింద్, చిడుమూరు ఏరియా కో -ఆర్డినేటర్ కట్టా శ్రీనివాసరావు,రేపాక ఏరియా కో-ఆర్డినేటర్ మాచర్ల వెంకన్నబాబు, గ్రామీణ వైద్యులు గుబ్బల ఆనంద్ తదితరులు పాల్గోన్నారు. (Story :ఘనంగా డా:బీఆర్ అంబేద్కర్ జయంతి)