ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి
న్యూస్ తెలుగు / వినుకొండ : మనదేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి పైన ఉన్నదని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని సిపిఐ వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. డాక్టర్ అంబేద్కర్ పదిహేను అడుగుల చిత్రపటంతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించిన సిపిఐ కార్యకర్తలు రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మతసామరస్యాన్ని కాపాడుతామని పట్టణంలో సిపిఐ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించడం చూపరులను ఆకట్టుకుందన్నారు. ప్రదర్శన అనంతరం శివయ్య స్తూపం సెంటర్ లో జరిగిన ప్రచార నిరసన ముగింపు కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతిని మొదలుకొని ఏప్రిల్ 14 బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి! వరకు భారతీయ జనతా పార్టీ విధానాలపై నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రజలు కమ్యూనిస్టులు చేస్తున్న వాస్తవిక ప్రచారం పట్ల ప్రజలు ఆసక్తి నపరుస్తున్నారని ఆయన అన్నారు. విభిన్న జాతులు మతాలు నివసిస్తున్న మన భారతదేశంలో అన్ని మతాలవారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి ఎందరో అసువులు బాసారని వారిలో అన్ని మతాలవారు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని నేడు మెజారిటీ మతం అని చెప్పుకుంటున్నటువంటి కొందరు మతపిచ్చగాళ్లు మైనారిటీ ప్రజలపై చేస్తున్న దాడులను ఉదా: గుజరాత్, మణిపూర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర బిజెపి పాలిత రాష్ట్రాలలో తీవ్రంగా జరుగుతున్నాయని దీనిని దేశ ప్రజలందరూ వ్యతిరేకించవలసిన అవసరం ఉందని కేంద్రంలో ఉన్న బిజెపి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతోన్మాద పోకడలతో మత రాజ్యం కోసం ఆర్ఎస్ఎస్ విధానాలు అమలు చేయుటకు ఉంటుందని దానికి చట్టసభలను సిబిఐ ఈడి లాంటి వ్యవస్థలను అక్రమంగా వినియోగిస్తూ ప్రజలపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై అక్రమ కేసులు బనాయించి తమ పార్టీలోకి వస్తే ఎంతటి అవినీతిపరులైన నీతివంతులు అవుతున్నట్టుగా సర్టిఫికెట్ ఇస్తున్నారని ఇది మనదేశ అన్ని వర్గాల ప్రజానీకానికి తీరని హాని జరుగుతుందని కమ్యూనిస్టులు అందరూ(కమ్యూనిస్టులు అందరూ సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీలు) సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి మనదేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడు కొనుటకు లౌకిక రాజ్యాంగ సోషలిస్టు వ్యవస్థను నిలబెట్టుకొనుటకు పోరాటాలకు సిద్ధం కావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు పేద దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పోరాటాలకు సిద్ధం కావాలని సమ సమాజం కావాలంటే “కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉన్నదని” డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాలను ఈ సందర్భంగా ఉటంకించిన మాటలను ఆయన తెలిపారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజం తాపనే ధ్యేయంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కొరకు పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. కమ్యూనిస్టుల ఆశయ సాధనలో కడవరకూ పోరుబాటలో నిలుస్తామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకొనుటకు ఐదు లక్షల రూపాయలు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, పవన్ కుమార్ కండ్రిక యోహన్ షేక్ మస్తాన్ సోమవారం దావీదు చీరాల అంజయ్య రాచమల్ల నాసరయ్య, కంచర్ల నాగరాజు, టంగుటూరి వెంకటరావు, టంగుటూరి బ్రహ్మయ్య, మురికిపూడి వెంకటేశ్వర్లు, కందుకూరి శివ కోటేశ్వరరావు, కందుకూరి బ్రహ్మం, కందుకూరి వెంకటేశ్వర్లు, పల్లెల వెంకటేశ్వర్లు, మల్లికార్జున షేక్ కొండ్రముట్ల చిన్న సుభాని రసపుత్ర చౌడయ్య, నక్క శ్రీదేవి, కుమారి, మస్తాన్ సాయమ్మ, కనకమ్మ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. (Story: ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి)