బాబా సాహెబ్‌కు ఘన నివాళి
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి: నవభారత వైతాళికుడు.. విశ్వమానవుడు.. సామాజిక సమతా స్ఫూర్తి.. సమున్నత విజ్ఞాన మూర్తి.. బడుగుల దీప్తి.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్..రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం వైభవంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో పండ్లు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఊరూరా పండుగ వాతావరణం తలపించగా.. జైభీమ్ నినాదాలతో పల్లె, పట్నం మార్మోగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.తదనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలోకాంగ్రెస్ గ్రామశాఖ పులికాశి రమేష్, తాజా మాజీ సర్పంచ్ గద్దల రమేష్, ముత్తినేని అశోకరావు, ముత్తినేని పాపారావు, పత్తిపాక త్రిమూర్తి, మంద సంపత్, తీగుళ్ళ పోషయ్య, గంగాధరి లింగమూర్తి, ఆవుల చిన్న వెంకటయ్య, ఇటికాల అనిల్, చుంచు రాకేష్, చుంచు అనిల్ తదితరులు పాల్గొన్నారు. (Story:బాబా సాహెబ్‌కు ఘన నివాళి)
ప్రత్యేక కథనం: నారదాసు ఈశ్వర్
(సీనియర్ జర్నలిస్ట్)