బాధితులకు రక్షణ కవచమే భారత రాజ్యాంగం
-జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
-సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య
న్యూస్ తెలుగు/సిద్దిపేట జిల్లా ప్రతినిధి: బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మార్చేందుకే రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాశాడని అలాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తోందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మండిపడ్డారు. ఆదివారం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా అక్కన్నపేట మండలం అంతకపేట, అక్కన్నపేట గ్రామాలలో ముగింపు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ప్రతిజ్ఞ చేసి పాదయాత్ర నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంతకపేట గ్రామం నుండి అక్కన్నపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మార్చేందుకే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని దేశం మొత్తం అనుసరించే నడుస్తోందని అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల వర్గ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా బిజెపి నాయకులు వ్యాఖ్యానించడం ఖండించారు. భారత రాజ్యాంగం మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇకపై ఊరుకోబోమని రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాండ్రాల దాము, మాజీ సర్పంచులు సంజీవరెడ్డి, రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి, కాశబోయిన రవి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు రవి, శ్రీనివాస్, త్రిమూర్తి, మాజీ ఎంపీటీసీ భాస్కర్ నాయక్, మ్యాక రమేష్, కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్, పులికాశి రమేష్,అశోక్, ఓగులవేణి రవి, సోషల్ మీడియా నాయకులు పరశురాం, కొమ్ముల శ్రీనివాస్, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
The Indian Constitution is a protective shield for the victims, according to Kadem Lingamurthy, Chairman of the District Library, and Bolisetti Shivayya, Chairman of the Single Window. They expressed their outrage over the BJP government’s alleged conspiracy to amend the Constitution, which was drafted by Dr. B.R. Ambedkar to improve the lives of marginalized and weaker sections of society.
The two leaders were speaking at the concluding ceremony of the “Jai Bapu Jai Bheem Jai Sanvidhan” program in Akkannapet mandal. They paid tribute to Dr. Ambedkar by offering floral wreaths at his statue.
Key Points:
– Constitutional Significance: The leaders emphasized that the Indian Constitution was written to uplift the downtrodden and weaker sections of society.
– Alleged Conspiracy: They accused the BJP government of plotting to amend the Constitution, which would adversely affect the lives of SC, ST, BC, and minority communities.
– Warning to BJP: The leaders warned the BJP government that they would not remain silent and would teach them a lesson in the coming days.
– Program Details: The program included a rally from Anthakpet village to Akkannapet, and several Congress party leaders and local representatives participated in the event.
Some key attendees included:
– Kadem Lingamurthy, District Library Chairman
– Bolisetti Shivayya, Single Window Chairman
– Jangapalli Ailya, Congress Party Mandal President
– Egidi Ailya, Single Window Vice Chairman
– Pandrala Damu, Youth Congress President
– Gampala Srinivas, Congress leader
– Pulikashi Ramesh, Congress leader
– Social media leaders, including Parasuram and Kommuluri Srinivas.
– Source By / Special Correspondent: Naradas Eshwar (Story : బాధితులకు రక్షణ కవచమే భారత రాజ్యాంగం)