Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మే 20 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

మే 20 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

0

మే 20 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం

17 సీపీఐ నేత రామకృష్ణ పర్యటన ను జయప్రదం చేయండి!

సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక: మధు

న్యూస్ తెలుగు/చింతూరు : బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మైనారిటీలకు, దళితులకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి తన హిందుత్వం మతోన్మాద ఎజెండా అమలులో భాగంగా ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ము తూ అనేక దాడులు చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడిo చారు.శుక్రవారం ఉదయం స్థానిక జట్ల సంఘము కార్యాలయములో యూనియన్ మేస్త్రీల సమావేశం జట్ల సంఘము అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టనున్నారని ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం ఆస్తుల కబ్జా చేయడానికి తప్ప, వక్ఫ్ ఆస్తులు అభివృద్ధికి కాదన్నారు.డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అంతర్జాతీయ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని భారత దేశంలో రాజకీయ పరిస్థితి చూస్తే బిజెపి పాలనలో నిరంకుశ హిందుత్వ కార్పొరేట్‌ రాజ్యం పట్టు మరింత బిగిసేలా చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నవని అన్నారు. కార్మిక వర్గం, రైతాంగం, శ్రామిక వర్గంలో వివిధ తరగతులు చేసిన ఉమ్మడి పోరాటం వల్ల మోడీ ప్రభుత్వంపైన, అలాగే దాని హిందూత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలపైన వ్యతిరేకత మరింత బలోపేతమైందిని ఆయన అన్నారు.గత మూడు దశాబ్దాలుగా అమెరికా అధిపత్యంలో సాగుతున్న అంతర్జాతీయ క్రమాన్ని రెండు మాసాల స్వల్ప వ్యవధిలో ట్రంప్‌ ప్రభుత్వం తలకిందులుగా మార్చింది. ‘అమెరికానే ప్రప్రథమం. అమెరికా మళ్లీ గొప్ప స్థానంలోకి’ వంటి నినాదాలతో ట్రంప్‌ అత్యంత వేగంగా సామ్రాజ్యవాద దుందుడుకు దాడికి సిద్ధమైపోయాడనేది స్పష్టంగా కనిపిస్తోందిని ఆయన అన్నారు.ఇది దాని సన్నిహిత మిత్రులైన నాటో, యూరప్‌లతో అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిస్తుందిని దక్షిణాఫ్రికా వంటి పేద దేశాలలో శత్రుపూరితమైన చొరబాటులను పెంచుతున్నదిని పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఘోరమైన మరణహోమ దాడికి వత్తాసునిస్తుందిని ఆయన పేర్కొన్నారు.ఈ కారణాల వల్లనే ట్రంప్‌ అధ్యక్ష కాలం ఇప్పటి వరకూ స్తబ్దుగా వున్న సామ్రాజ్యవాదుల అంతర్గత ఘర్షణలతో సహా అన్ని రకాలైన ప్రధాన సామాజిక వైరుధ్యాలను తీవ్రతరం చేసింది అన్నారు.
సుంకాలు, వీసాల విషయంలో ట్రంప్‌ సర్కారు భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోకుండా నరేంద్ర మోడీ, బిజెపి ప్రభుత్వం నిశ్చలమైన మద్దతునిస్తూనే ఉంది. అమెరికా సామ్రాజ్య వాదపు సరికొత్త దుందుడుకు పాత్రకూ భారతదేశాo అండగా వుండడం గమనార్హం అని మధు అన్నారు.కార్పొరేట్‌ అనుకూల నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగే వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంపై బిజెపి చేస్తున్న నిరంకుశ దాడులనూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బ తీసే నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పని చేయాలని ఈ దృక్పథంతో పార్టీ ‘ఇండియా’ వేదిక వంటి లౌకిక ప్రతిపక్ష శక్తుల విశాల వేదికలను కొనసాగించడానికి కృషి చేస్తుందిని మధు అన్నారు.ఆహార భద్రత, మహిళలపై అత్యాచారాలు, జాతీయ విద్యా విధానం, నిరుద్యోగం వంటి అంశాలపై మహిళలు, విద్యార్థులు, యువత రంగంలో నిలిచి పోరాడుతున్నారు.రాబోయే రోజుల్లో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనను విస్త్రతపరచాలిని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్‌ కోడ్ల విధింపునకు వ్యతిరేకంగా ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన ఒకరోజు సమ్మె ను అన్ని వర్గాల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సంఘము కార్యదర్శి సప్ప రమణ, అధికార బడి దేముడు బాబు, అప్పల నాయుడు , నల్ల రామారావు, దుర్గా ప్రసాద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.(Story : మే 20 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version