‘మాతృ మరియు శిశు మరణాలు నివారించాలి “
డా.ఈ బి .దేవి డి యం హెఛ్ ఓ
న్యూస్‌తెలుగు/అనంతపురం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ .బి దేవి అధ్యక్షతన మార్చి మాసంలో జిల్లాలో జరిగిన 15 శిశు మరణాలు ,ఒక మాతృమరణము
జరగగ ఈ మరణాలు జరగడానికి గల కారణాలను ఆ ప్రాంత డాక్టర్స్ మరియు సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది .
ఈ సందర్బంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ…. మాతృమరణాలు శిశుమరణాలు నివారించాలని , ముక్యంగ శిశు మరణం కానీ మాతృ మరణం కానీ జరిగినప్పుడు మరణానికి ముందు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనాయి మరణానికి గల కారణాలు తెలుసుకొని. మరో సారి అలాంటికారణం తో మరణం జరగకుండా డాక్టర్స్ , సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు . అలాగే గర్భిణీ స్త్రీ డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు ,
ఐ సి డి యస్. ప్రాజెక్టు వారు,
గర్భిణీ స్త్రీ లకు అందించే న్యూట్రిషన్ ఫుడ్ ను వారు సంపూర్ణముగా తీసుకొనేలా చూసి రక్త హీనతతో బాధ పడకుండా చూడాలని ఆదేసించారు ,ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారలు లోపు రిజిస్ట్రార్ చేసుకొని. ,ఆమెకు అన్నిరకాల వైద్య పరీక్షలు. వైద్యసేవలు అందించాలని కోరారు,ప్రతి గర్భిణీ స్త్రీని పరీక్షించాలని. ప్రమాదకర లక్షణాలు వున్న గర్భిణీ స్త్రీల పట్ల జాగ్రతలు తీసుకొంటూ సుఖప్రసవం జరిగేలా చూడాలని ఆదేశించారు. .
రక్త హీనత వున్నా ,గుండె సంబంధిత సమస్యలు వున్నా ,తక్కువ ఎత్తు ,,తల్లి గర్భం లో ఉమ్మనీరు తక్కవ వున్నా ,బిడ్డ పెరుగుదల లేకపోయిన , హై రిస్క్ గర్భవతులను గుర్తించి వారికీ ప్రత్యేక వైద్యసేవలు అందించాలని కోరారు .
ఆశాడే రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రము డాక్టర్స్.వైద్య సిబ్బందికి. గర్భిణీ స్త్రీలకు ,, తల్లి మరియు బిడ్డ కు సంబందించిన ఆరోగ్యం ఫై అవగాహన కల్పించాలని ఆదేశించారు . శిశు మరణాలవిషయంలో కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలన్న ఏ శిశు వు ఐన నెలలు నిండక పుట్టిన , లేదా తక్కువ బరువుతో పుట్టిన ,శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్న , యన్ ఆర్ సి లో చేర్పించి పిల్లల ఆరోగ్యం కాపాడాలన్నారు. మాల్ న్యూట్రిషన్ వల్ల ఏ శిశువు మరణించ కూడదన్నారు. పుట్టిన ప్రతి శిశువుకు గంటలోపు తల్లిపాలు తాగించాలన్నారు బుడ్డి పాలు తాగించడం మంచిది కాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా యుగంధర్ ,డా శ్రీనివాసులు ,డా అరుణలత ,డా బాబ్ జాన్ ,యం పి హెచ్ ఈ ఓ లక్ష్మన్న ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : ‘మాతృ మరియు శిశు మరణాలు నివారించాలి “)