మహాత్మ జ్యోతి బా పూలే జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వనపర్తి : మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక
నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం, కుల వివక్షను వేరు చేయడం కోసం, ఆడవారి అభ్యున్నతికి చదివే ముఖ్యమని భావించి వారి చదువు కోసం పోరాడిన వ్యక్తిని భారత దేశంలో మొదటి మహాత్మునిగా కీర్తింపబడిన జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కురుమన్న, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు గంధం నాగరాజు, వెంకటేష్, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, గంధం భరత్, శివకుమార్, శ్రీధర్ గౌడ్, పాషా కృష్ణయ్య, నాగరాజు , హామాలి సంఘం ప్రెసిడెంట్ సూరి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.(Story : మహాత్మ జ్యోతి బా పూలే జయంతి వేడుకలు )