వినుకొండ లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
చీఫ్ విప్ జీవి కార్యలయంలో
న్యూస్ తెలుగు /వినుకొండ : సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు శుక్రవారం వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో కూటమి నాయకులు జ్యోతిరావు పూలే చదవడానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, కుల వివక్షత పై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్య అవకాశం కల్పించిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కూటమి నాయకులు కొనిజేటి నాగ శ్రీను రాయల్, శంకర్రావు శ్రీనివాసరావు, లాయర్ సైదారావు, పివి సురేష్ బాబు, పెమ్మసాని నాగేశ్వరరావు, ముండ్రు సుబ్బారావు, మురళి యాదవ్, రైతు నరేంద్ర, ఆయుబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
వైసిపి కార్యాలయంలో..
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వినుకొండ పట్టణం లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు సామాజిక తత్వవేత్త, సామాజిక దార్మికులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
తహసిల్దార్ కార్యాలయంలో..
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తహశీల్దారు కార్యాలయం నందు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు శ్రీరాములు , తహశీల్దారు సురేష్ నాయక్, డి. టి మురళి, ఆర్. ఐ శ్రీహరి, మండల ఎడ్యుకేషనల్ అధికారి జఫ్రూల్లా ఖాన్ , మండల వ్యవసాయ అధికారి వరలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.