ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
న్యూస్ తెలుగు / సాలూరు: భారతదేశంలో సామాజిక , సాంఘిక సంస్కరణలకు మూల పురుషుడు భరత మాత ముద్దు బిడ్డ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో199 వ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక మార్పులు చదువుతోపాటు సంస్కరణల వస్తాయని అన్నారు. ఆయన ఆశయాలతో పేదరికం లేని సమాజాన్ని ఈ ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు. స్త్రీలను గౌరవించి కులాల మధ్య వివక్ష లేకుండా చూడాలని సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. అనగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. కులం మతం రాజకీయం చూడకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వంగపండ అప్పలనాయుడు,గిరి రఘు,హరి బాలాజీ,మజ్జి అప్పారావు,దండి శ్రీనివాసరావు,మాదిరెడ్డి మధుసూదన్ రావు, పతేడ బాలాజీ, రవి పాల్గొన్నారు. (Story : ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి)