వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే తనువు చాలించింది
న్యూస్ తెలుగు/సాలూరు : రెండు సంవత్సరాలుగా వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే మరణించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కూర్మ రాజుపేట కు చెందిన గిరిజన వితంతు మహిళ వంజరపు అన్నపూర్ణ-62 బుధవారం మృతి చెందిందిన సంఘటన జరిగింది. 2023 డిసెంబర్ నెలలో భర్త వంజరపు కన్నయ్య అనారోగ్య కారణాల వలన మరణించెను. అప్పటి ప్రభుత్వంలో ఆయనకి పెన్షన్ ఇచ్చేవారు. ఆయన మరణించిన నుండి ఎన్నిసార్లు సచివాలయం వెళ్ళి ఇప్పటివరకు దరఖాస్తు చేస్తూనే ఉంది. పెన్షన్ లేకపోవడంతో తినడానికి తిండి లేక ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉండడం వలన అప్పుడు పెన్షన్ ఆమెకు మంజూరు అవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు కావస్తున్న ఇప్పటివరకు దరఖాస్తు పెట్టిన పెన్షన్ మంజూరు కాలేదు. భర్త చనిపోయిన వితంతువులకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాకపోవడం. తో రాష్ట్రంలో ఉన్న వితంతు మహిళలందరూ చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల తర్వాత భర్త చనిపోయిన వితంతువులకు కొత్త పెన్షన్లు ఇస్తున్నారే తప్ప రెండు సంవత్సరాల క్రితం నుంచి మరణించిన వారు ఎవరికి కూడా ఈ వితంతు పెన్షన్ ఇవ్వకపోవడంతో నిరుపేదలైన వితంతు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే బ్రతికినన్నాళ్ళు ప్రభుత్వ సహాయం కోసం ఎంతగానో ఎదురు చూసి ఆమె అసువులు బాసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా మరణించిన అన్నపూర్ణమ్మ కు మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ దహన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు సంక్షేమం చూడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడే గానీ ఫుడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని అన్నారు. మానవత్వం లేకుండా. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు కదా మానవత్వం అనేది సనాతన ధర్మంలో ఒక భాగమైనని మానవత్వంతో ఆలోచించి గత 11 నెలలగా ఇవ్వని వితంతువు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, (Story ” వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే తనువు చాలించింది)