వినుకొండ నూతన బార్ అసోసియేషన్ కు ఆత్మీయ సమావేశం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ బార్ అసోసియేషన్ గతవారం నిర్వహించిన ఎలక్షన్ నందు నూతనంగా ఎన్నికైన సందర్బంగా సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదుల కోర్టు సిబ్బందికి, న్యాయవాద గుమస్తాలకు నూతన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మీసాల శ్రీనివాసరావు, సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ, నీలం శేఖర్ బాబు, nకోశాధికారి వరగాని శివ శంకర్ బాబు లను బార్ అసోసియేషన్ లోనీ సీనియర్, జూనియర్ న్యాయవాదులు అందరూ కలిసి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ , జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. (Story : వినుకొండ నూతన బార్ అసోసియేషన్ కు ఆత్మీయ సమావేశం)