గీతాంజలి స్కూల్స్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అధితిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ టి. క్రిష్ణ వేణి చిన్నారులకు కోర్స్ కంప్లీట్ చేసిన సందర్బంగా శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. చిన్నారులు ఎంతో ఇష్టంతో పూర్తి చేసిన కోర్సు నకు సంబందించి వారికి ఇస్తున్న ఈ చిరు సత్కారం వారిలో స్ఫూర్తిని నింపి మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకునేలా ఒక ప్రోత్సాహంగా మరియు ఒక అపురూప జ్ఞాపకం గా ఉంటుంది అనే సదుద్దేశం తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అనంతరం చిన్నారులు గ్రాడ్యుయేషన్ సాంప్రదాయ దుస్తులు ధరించి కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికెట్స్ మరియు ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై. శేషగిరి రావు, కరస్పాండంట్ వై. లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి స్కూల్స్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు)