Homeవార్తలుతెలంగాణఇంటి పండుగలా రజతోత్సవ సభకు రావాలి

ఇంటి పండుగలా రజతోత్సవ సభకు రావాలి

ఇంటి పండుగలా రజతోత్సవ సభకు రావాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : కె.సి.ఆర్ అధ్యక్షతన ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం మెట్టుపల్లి(6వ వార్డ్)నందు జరిగింది. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ 14 ఏండ్ల ఉద్యమ చరిత్ర అనంతరం 10ఏండ్ల అధికారంలో తెలంగాణ సుభిక్షంగా ఉండి హరిజన,గిరిజన,బడుగు వర్గాలు,రైతు కార్మిక కర్షక విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు అని అన్నారు. అనేక దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని కరెంట్ ,రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు భీమా వంటి పథకాలకు తిలోదకాలు ఇచ్చింది అని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలు,420 హామీలు మహిళలకు 2500,తులం బంగారం,నిరుద్యోగ భృతి,విద్యార్థులకు విద్యా భరోసా, స్కూటీలు వంటి పథకాలు తుంగలో తొక్కి ప్రజలను హరిగోసా పెడుతుందని అందుకే ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేసేవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ అస్థిత్వం కోసం పుట్టిన పార్టీ బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పండగలా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఈ సభ విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండెం.కురుమూర్తి యాదవ్ ,నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,గులాం ఖాదర్ ఖాన్,బండారు.కృష్ణ, నాగన్న యాదవ్, కంచె.రవి,ఉంగ్లం . తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,జోహెబ్ హుస్సేన్,డాక్టర్. ధ్యానియల్,సూర్యవంశం.గిరి,స్టార్.రహీమ్,ఆరీఫ్,సింగణమోని.గోపాల్,తిరుపతి యాదవ్,రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ఇంటి పండుగలా రజతోత్సవ సభకు రావాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!