10న హోమియో పితామహుడు డాక్టర్ హనెమాన్ జయంతి వేడుకలు
రాష్ట్రీయ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ నాయక్
జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ గౌరీ శంకర్
న్యూస్ తెలుగు/అనంతపురం : ఈనెల 10వ తేదీన అనంతపురం సప్తగిరి బల్లా ఫంక్షన్ హాల్లో హోమియో పితామహుడు డాక్టర్ హనెమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. గౌరీ శంకర్ లు తెలిపారు. రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ హోమియోపతి డే ను జరుపుకుంటున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా 270 వ ప్రపంచ హోమియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అనంతపురం. సత్య సాయి బాబా జిల్లాలలో ఉండే ఆయుర్వేద, యోగా, నేచరోపతి, యునాని . సిద్ధ, హోమియో. ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమానికి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరబోయిన నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండారు నాగేశ్వరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్ కబీర్. రాష్ట్ర మహిళా విభాగ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శాంతిప్రియ, అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి కేదార్నాథ్…, డాక్టర్ మాలిక్.. సత్యసాయి బాబా జిల్లా డాక్టర్ వై అనురాధ, జిల్లా అధ్యక్షులు, డాక్టర్ ఎం. ఇమ్రాన్ ఖాన్ జిల్లా ఉపాధ్యక్షులు, డాక్టర్ కె. తేజేశ్వర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు హాజరవుతారని తెలిపారు. కావున ఆయుష్ వైద్యులు, వైద్య విద్యార్థులు గురువారం ఉదయం 10 గంటలకు డాక్టర్ హనెమాన్ జయంతి వేడుకలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.(Story : 10న హోమియో పితామహుడు డాక్టర్ హనెమాన్ జయంతి వేడుకలు )