వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెట్ కమిటీలు కీలక పోషిస్తాయి
న్యూస్ తెలుగు /సాలూరు : వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు 15 మంది డైరెక్టర్లకు ఎంపికైనందుకు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు విజన్‌ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించిందని తెలిపారు.వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెటింగ్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన ధర, సమర్థమైన మౌలిక వసతులు, పారదర్శక విధానాల అమలులో ఈ కమిటీల పాత్ర అమూల్యమైనదని తెలిపారు. ముఖి సూర్యనారాయణ అనుభవం కలిగిన, వ్యవసాయ సమస్యల పట్ల లోతైన అవగాహన కలిగిన నాయకులు. ఆయన నాయకత్వంలో ఈ కమిటీ రైతుల సంక్షేమానికి అనేక విలువైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు.ఇతర సభ్యులైన వైస్ చైర్మన్ మింది సింహాచలం . మరియు 15 మంది కమిటీ సభ్యులకు కూడా మంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు తమ సమయపాలన, ప్రజాసేవా మనోభావంతో సాలూరు నియోజకవర్గ రైతాంగానికి శక్తివంతమైన మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు.
రైతులు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నూతన పాలకవర్గం రైతుల ఆశల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు ,మండల అధ్యక్షుడు పరమేష్, మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెట్ కమిటీలు కీలక పోషిస్తాయి )