సామాజిక సేవనుండే నాయకులు పుట్టుకొస్తారు -ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
కురుగుంట గ్రామంలో ఘనంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు వేడుకలు
న్యూస్ తెలుగు/అనంతపురం : రూరల్ పరిధి కురుగుంట గ్రామంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, ముఖ్య అతిథులుగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్ , ఎస్కేయూ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మురళీధర్ రావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం .విష్ణు ప్రియ ,ఎస్సార్ ఎడ్యుకేషనల్ వ్యవస్థాపకులు సుంకర రమేష్ పాల్గొని ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలతో నివాళులు అర్పిస్తూ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ గారు “మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాణం యువత చేతిలోనే ఉందని యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని స్వామి వివేకనంద అడుగుజాడల్లో యువత నడవాలని విద్యార్థి దశ నుండే సేవా మార్గంలో ఉంటూ పరులకు సహాయం పడాలని, జాతీయ సేవా పథకం ద్వారా యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ స్వచ్చంద్ర కోసం ప్రజలంతా పాటుపడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని తెలిపారు. నేను కూడా సమాజ సేవలో ముందు ఉంటానని అంబికా ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో కురుగుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మా సంస్థ అంబిక ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు”. అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్ గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవా దృక్పథంతో మెలగడం సమాజం అభివృద్ధిలో భాగం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ సేవా పథకానికి మరిన్ని నిధులు కేటాయించి విద్యార్థుల్లో సేవ స్ఫూర్తిని పెంపొందించాలని. విద్యార్థి దశ నుండే ఉన్నత భావాలతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ ఎన్ ఎస్ ఎస్ మరియు ఎన్సిసి లలో ఉండే విద్యార్థులు బాసటగా ఉండాలని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత మరియు కెనరా బ్యాంక్ సహకారంతో సున్నా బ్యాలెన్స్ అకౌంట్ పాస్బుక్కులను గ్రామస్తులకు ఎంపీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వారం రోజులు స్పెషల్ క్యాంపులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంపీ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సహదేవుడు, ఐ కే సి కోఆర్డినేటర్ జితేంద్ర, లెక్చరర్స్ శ్రీదేవి, శశాంక్ మౌలి, ఆర్థిక అక్షరాస్యత కోఆర్డినేటర్ బ్రమరాంబ ఎస్సార్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి ప్రసిల్లా, కే .మహేంద్ర, ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు కురుగుంట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.(Story : సామాజిక సేవనుండే నాయకులు పుట్టుకొస్తారు -ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ )