విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : మాతృశ్రీ జిల్లెల్లమూడి అమ్మవారి జయంతి ని పురస్కరించుకొని పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో టి. శేషయ్య దంపతులు సంఘంలోని ఐదుగురు సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భవన ఆవరణలో టి.శేషయ్య దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం లోని సభ్యుల సహాయ సహకారాలతో నేడు 85వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నామని, ఇదేవిధంగా ఇప్పటికే పలు రకాల 82 సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అవ్వారు కోటేశ్వరరావు, జి.నాగేంద్రుడు, పి. నారాయణ రావు, గోపి, సుబ్బయ్య శర్మ, ఆది రాములు, ఎంవి శర్మ, దీక్షితులు, శంకరరావు, దుబ్బల దాసు, హసన్, రాఘవయ్య, బి.పి.ఎస్. సుందర్ రావు, కృష్ణమూర్తి ,ప్రసాదు, హనుమంతరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.(Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం)