ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ వారోత్సవాలు జరపాలని నిర్ణయం
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నివాసంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదిక నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని, ఇంతకుముందు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవారని, ఇకనుండి ప్రజల వద్దకే పోయి సమస్యలను స్వీకరించి వార్డు, ఊరు, మండలం, జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకుడు సతీష్ యాదవ్ తెలిపారు. ప్రజలు చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిస్కారమయ్యే వరకు పోరాడుతామని, ఇప్పటివరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోని ఎదుర్కొంటామని, ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, శివకుమార్, పుట్టపాక బాలు,పాషా,కుమార్, శ్రీనివాసులు, సురేష్, రాముడు, కృష్ణయ్య, నాగరాజు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.(Story :ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ వారోత్సవాలు జరపాలని నిర్ణయం )