శ్రీరాముని ఆదర్శ బాటలో కూటమి ప్రభుత్వ పాలన
శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : శ్రీరాముడి మార్గంలోనే అందరూ మెచ్చే ఆదర్శ సమాజం కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు సత్యం, ధర్మం, న్యాయం చూపిస్తాయని అందుకే యుగాలు మారినా, తరాలు గడిచినా అవి నిలిచి ఉన్నాయన్నారు. కూటమి పాలన కూడా ఈ బాటలోనే ప్రజలు అందరికీ సేవ చేస్తోందని, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. శ్రీరాముడు అందరి సహకారంతో రాజ్యం నడిపినట్లే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఐకమత్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి శాంతి, సంతోషం అందించేందుకు ఆ ఆదర్శ పురుషుడి మార్గంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలు అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, అవకాశాలు తెచ్చి ఆనందం నింపాలని శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటున్నానన్నారు. (Story : శ్రీరాముని ఆదర్శ బాటలో కూటమి ప్రభుత్వ పాలన)