Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కోసం పాటుపడతాం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కోసం పాటుపడతాం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

0

స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కోసం పాటుపడతాం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

న్యూస్ తెలుగు/అనంతపురం : అనంత రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామం నందు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ – 2 మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో “నేషనల్ సర్వీస్ స్కీం స్పెషల్ క్యాంప్” లో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై అవగాహన ర్యాలీ మరియు పరిసరాల పరిశుభ్రతను అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారిని ఎం. విష్ణు ప్రియ మాట్లాడుతూ… ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ లో భాగంగా కురుగుంట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక పార్కు గ్రౌండ్ను శ్రమదానంతో విద్యార్థులంతా పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు తెలియపరుస్తూ పాల్గొన్న యువతతో పరిశుభ్రతపై నినాదాలు చేస్తూ వీధులన్నీ తిరిగి అవగాహన కల్పించారన్నారు. విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్రపై ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఎస్సార్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి. ప్రిసల్లా, బోయ రాశి, ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్ కే .మహేంద్ర ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంతోష్ నాయక్, తిప్పేస్వామి,అభిషేక్ నాయక్ , మురళీకృష్ణ,హరిత,వెంకట సాయి తదితరులు మొదలైన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కోసం పాటుపడతాం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version