నూతన బస్సులు ప్రారంభం
న్యూస్ తెలుగు/సాలూరు: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
నూతన బస్సుల ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని ఆమె పేర్కొన్నారు.ఈ బస్సుల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు, ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సిబ్బంది సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నమ్మాది తిరుపతిరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కునిశెట్టి భీమారావు తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన బస్సులు ప్రారంభం)