కళాకారులకు ఉగాది పురస్కారాలు అందజేత..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్డు లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో ఉగాది పండుగ సందర్భంగా నియోజకవర్గ కళాకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో కళాకారులకు అవకాశాలు కల్పించాలని, డీజే సిస్టం తో మితిమీరిన శబ్ద కాలుష్యాన్ని నివారించాలని తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే ఇప్పటివరకు వినుకొండ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో తహసిల్దారులకు అర్జీలు ఇవ్వటం జరిగింది. చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ కి ప్రభుత్వానికి అర్జీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సభ అనంతరం 5 మండలాల నుంచి వచ్చిన కళాకారులకు ఉగాది పురస్కారాలను అందించి,సన్మానం చేశారు. కళాకారులతో పాటు సమాజం కోసం శ్రమించే వివిధ వర్గాల వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ , గుమ్మడి కళా పీఠం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలుగా సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఐదు మండలాల కళాకారులు, మహిళా కళాకారులు పాల్గొన్నారు. (Story : కళాకారులకు ఉగాది పురస్కారాలు అందజేత..)