అగ్నిప్రమాద బాధితులకు శివశక్తి ఫౌండేషన్ ఆర్థిక సాయం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గరికపాడు, వినుకొండ మండలం పెదకంచర్లలో ఇటీవల జరిగిన దుర్ఘటనల్లో అగ్నిప్రమాదాల వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలకు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు కుటుంబ ఆధ్వర్యంలోని శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించింది. ఇళ్లు, ఆస్తులు బూడిదై నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయంతో పాటు జీవనాధారాన్ని కల్పించేందుకు అండగా నిలిచింది. పెదకంచర్ల గ్రామానికి చెందిన ఒంటేరు బాలకోటేశ్వరరావు కుటుంబం అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయింది. వారికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఫౌండేషన్ తరపున స్వయంగా సాయం చేశారు. వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు, బియ్యం, దుస్తులతో పాటు ఆర్థిక సహాయం అందజే శారు. గరికపాడు గ్రామానికి చెందిన కొక్కర వీరాంజీ కుటుంబానికి కూడా రూ. 5,000 నగదు సాయంతో పాటు వంట సామగ్రి, బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులు అందించారు. వారికి ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి స్వయంగా ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, “అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలవడం కనీస బాధ్యత అని..శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ద్వారా ఈ కుటుంబాలకు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. కష్ట సమయంలో అండగా నిలిచిన జీవీ ఆంజనేయులు, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్‌కు బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, మాదాల చిరంజీవి, రామినేని ఆంజనేయులు, ముత్తినేని హనుమంతరావు, దొడ్ల నాగరాజు మాజీ సర్పంచ్, ముక్కంటి వైస్, ముక్కంటి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. (Story : అగ్నిప్రమాద బాధితులకు శివశక్తి ఫౌండేషన్ ఆర్థిక సాయం)