కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వక్ఫ్ బిల్లుపై అభ్యంతరాలు
రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న జీవీ..
న్యూస్ తెలుగు / వినుకొండ : ముస్లిం సమాజంలో వక్ఫ్ బిల్లు-2025పై నెలకొన్న అభ్యంతరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి నేరుగా తాను, కేంద్రానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ద్వారా ఈ విషయాలను చేరవేస్తామన్నారు. తద్వారా తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినుకొండలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక తిమ్మాయపాలెం రోడ్ లోని ఈద్గా మైదానంలో సోమవారం నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో చీఫ్ విప్ జీవీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ముస్లిం సోదరులకి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందన్నారు. తాను 3సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఇప్పుడు చీఫ్ విప్ కావడంతో వారి సహకారాన్ని ఎప్పుడూ మరిచి పోనన్నారు. స్థానిక ఈద్గా, మర్కజ్ మసీద్ కమిటీ వారు రూ. 40లక్షలు కావాలని అడిగారని… దానిపై మున్సిపాల్టీలో తీర్మానం చేయించి అనుమతులు కూడా తీసుకుమన్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఈద్గా ప్రాంతం అభివృద్ధి చేస్తా మన్నారు. ఈద్గా అభివృద్ధి కోసం సగం ఖర్చును వ్యక్తిగతంగా ఇస్తా అన్నానని, ఆ మేరకు సహాయం చేస్తామన్నారు. అందరు పిల్లల్ని బాగా చదివించాలని పేదరిక నుంచి బయటపడేందు కు అదో మంచి మార్గంగా గుర్తించాలన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నవారందరికీ అభినందనలు తెలిపారు. ప్రార్థనల అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆత్మీయ ఆలింగానాలతో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, కౌన్సిలర్లు,పట్టణ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, షమీం ఖాన్, సౌదాగర్ జానీ, గోల్డ్ కరీముల్లా,పీవీ సురేష్ బాబు, మత పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వక్ఫ్ బిల్లుపై అభ్యంతరాలు)