బ్రాహ్మణ భవనానికి రూ.2 లక్షలు సాయం
అపరకర్మల భవన నిర్మాణానికి కూడా సాయం చేస్తామని హామీ
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుతోనే బ్రాహ్మణుల సంక్షేమం సాధ్యం: జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న బ్రాహ్మణ భవనానికి ప్రకటించిన మేరకు రూ.2 లక్షలు విరాళం అందజేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వారికి వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా కూడా అన్నివిధాల అండగా నిలుస్తామని కూడా హామీ ఇచ్చారు. వారి అపరకరమల సత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా రూ.25 లక్షలు నిధులు తీసుకొచ్చి, పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే వేద పాఠశాల, గాయత్రీనగర్ అభివృద్ధికి అండదండలుగా ఉంటామన్నారు. సోమవారం వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో తనను కలసిన బ్రాహ్మ ణ సంఘాలతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు జీవీ. అనంతరం ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో బ్రాహ్మణ సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2014 ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. ఈ దఫా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామ న్నా రు. ఆ క్రమంలోనే బ్రాహ్మణ సంఘ అభివృద్ధి కోసం జరుగుతున్న భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులు కూడా వేగంగా వచ్చేలా ఆర్డీవో, తహసీల్దార్‌లతో మాట్లాడతానని తెలిపారు. అలానే గాయత్రీనగర్‌లో ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్లు హౌసింగ్ లోన్‌లు, ప్రభుత్వం తరఫున గృహ నిర్మాణ సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గృహనిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడటం కూడా జరిగిందన్నారు. స్థలం, ఇల్లు లేని పేద బ్రాహ్మణులకు టిడ్కో ఇళ్లు ఇచ్చేలా చూస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన చీఫ్ విప్ జీవీకి ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మణ సంఘం తరఫున పీవీ సురేష్ బాబు, జీవీ రమణరావు, కేసనపల్లి సుబ్బారావు, గాలి శ్రీనివాసరావు, జి.మాధవరావు, బొగ్గరం బుచ్చిరాజు, సీహెచ్ భవాని శంకర్, బి.రవికుమార్, జనార్ధన చార్యులు, శ్రీనివాస్ శర్మ, వి.చంద్రశేఖర్, రఘు మాస్టర్, గాలి శ్రీ కృష్ణయ్య, మంత్రిరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story : బ్రాహ్మణ భవనానికి రూ.2 లక్షలు సాయం)