పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం
న్యూస్ తెలుగు/ సాలూరు : పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం న్యూఢిల్లీ పార్లమెంట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ అరకు లోయ లో తయారుచేసిన కాఫీ స్టాల్ ను ఆమె కేంద్ర మంత్రి పీయుష్ గోయిల్ , కిరణ్ రిజిజు, జువాల్ ఓరం తో కలిపి ఇష్టాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్గానిక్ కాఫీ కేవలం ఒక పానీయమే మాత్రమే కాదు. ఇది 1.5 లక్షల గిరిజన రైతుల శ్రమకు దక్కిన ఫలితం, ఎన్నో ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న గిరిజన రైతుల కృషి నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపిందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, అరకు కాఫీ లాంటి GI ఉత్పత్తులు గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. ఇది గ్రామీణ ప్రాంతాల సాధికారతకు తోడ్పాటును అందించడమే గాక భారతదేశ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోందని అన్నారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతుగా నిలిచి పార్లమెంట్లో నేడు అరకు కాఫీని ప్రారంభించిన పీయూష్ గోయల్ కి , జువాల్ ఓరాం కి, కిరణ్ రిజిజు కి హృదయపూర్వక కృతజ్ఞతలు. సహకరించిన లోకసభ స్పీకర్ ఓం బిర్లాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కి మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు కు మతుకుమిల్లి భరత్ కు కలిశెట్టి అప్పలనాయుడు కు, మాగుంట శ్రీనివాసరెడ్డి కు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story :పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం)