క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
న్యూస్ తెలుగు/సాలూరు : భారతదేశాన్ని క్షయ రహిత దేశంగా ఉండాలంటే ప్రజలుకి ఈ వ్యాధిపై అవగాహన ఉండాలని సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు గోపాలరావు,కాశీ విశ్వనాథ్ ,అన్నాజీ రావు ,లోక్ నాయక్ తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఈ శనివారం సాలూరు ఏరియా హాస్పిటల్ నుంచి బోసుభొమ్మ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారం చేశారు.ఈ కార్యక్రమం లో డాక్టర్లు మాట్లాడుతూ ప్రజలకు టిబి పై అవగాహన కల్పించాలని అన్నారు.ఈ వ్యాది ఎక్కువగా పొగ మరియు మందు తాగే వాళ్ళల్లో వచ్చే అవకాశం వుంటుందని అన్నారు.అలాగే సరైన పోషకాహారం తీసుకోక పోవటం వల్లన షుగర్ మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయని అన్నారు. టిబి మందులు వాడుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాది సోకే అవకాశం ఉందని అన్నారు.టిబి పేషెంట్ తో సన్నిహితంగా వున్న వ్యక్తులకు ముందుగానే స్క్రీనింగ్ చేసి లక్షణాలు లేకపోతే టిబి ఇన్ఫెక్షన్ రాకున్నా మందులు ఇవ్వడం కూడా జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యాది రాకున్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు టిబి వ్యాధి యొక్క లక్షణాలను అడిగి తెలుసుకొని లక్షణాలు వున్న వాళ్ళను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఏరియా ఆసుపత్రికి రక్త పరీక్షలు చేసుకోవాలని అన్నారు. టిబి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు,రెండువారలకు మించి జ్వరం,దగ్గుతున్నప్పుడు కఫము ద్వారా రక్తపు జీరలు పడటం.బరువు తగ్గుట, ఇలాంటి లక్షణాలు వుంటే వెంటనే దగ్గర్లో వున్న వైద్య సిబ్బంది కి లేదా హాస్పటిల్ కి వెళ్లి డాక్టర్ గారిని సంప్రదించి రక్త పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. వ్యాధి వచ్చిన వ్యక్తులు మంచి పోషకాహారం తీసుకోవాలి అని చెప్పారు.టిబి నిర్ధారణ అయితే 6 నెలలు పాటు ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో సిబ్బంది పర్వేక్షణలో ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో, ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది , నరేష్ టిబి సూపర్వైజర్ , పాల్గొనడం జరిగింది. (Story : క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం)