గీతమ్స్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్ లో గీతమ్స్ విద్యాసంస్థల వారి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఏ. జి. పి. ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు, మున్సిపల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిలర్ నక్క రమణారావు, పివి సురేష్ బాబు హాజరయ్యారు.
ముందుగా అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవం చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ. చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు నారాయణ రమేష్, గీతమ్స్ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతమ్స్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు)