92 కిలోల గంజాయి సీజ్
జిఆర్పి సిఐ రవికుమార్
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం,ఎస్ కోట రైల్వే స్టేషన్లలో శనివారం జిఆర్పి సిఐ రవికిరణ్ ఆధ్వర్యంలో ఎస్సై బాలాజీ రావు ఇతర సిబ్బంది తనిఖీలు నిర్వహించి 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.శనివారం జిఆర్పి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ కోట రైల్వే స్టేషన్ లో తనిఖీ చేస్తుండగా 61 కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయనగరం రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తుండగా 31 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.ఈ రెండు కేసుల్లో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని,ఢిల్లీ,ముంబై, హైదరాబాద్ చెందిన నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి పై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవద్దని తెలిపారు తన పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లో గంజాయి పై నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై బాలాజీ రావు సిబ్బంది పాల్గొన్నారు . (Story : 92 కిలోల గంజాయి సీజ్)