బీసీలను మోసం చేసే తెలంగాణ బడ్జెట్
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్రబడ్జెట్ బీసీలను మరోసారి మోసం చేసినట్లు అయిందని బీసీలకు తీవ్ర అన్యాయంగా ఉందని వనపర్తి జిల్లా బిజెపి ధార్మిక సెల్ ఎండోమెంట్ కో కన్వీనర్ భగవంతు యాదవ్ అన్నారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం యాదవులతో డీడిలు బ్యాంకులో కట్టించుకొని గొర్రెల పంపకం చేయకుండా మోసం చేశారని
వాల్మీకులను ఎస్టిలో చేర్పిస్తానని చెయ్యలేదు అదేవిధంగా గీత కార్మికులకు పెన్షన్ ఇస్తానని మోసం చేశారని ఇలా బీసీలకు మోసం చేశారని
రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ లో అమలు చేయకుండా బీసీలకు స్వయం ఉపాధి కల్పించకుండా ఒంటెద్దు పొగడతో బీసీలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపినందుకు ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని వారన్నారు
ఈ కాంగ్రెస్ పార్టీ 420 ఉచిత హామీలతో బీసీలకు కార్పొరేషన్లతోపాటు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ భృతి మహిళలకు 2500 అమలు చేస్తామని ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 14 నెలలుపూర్తి కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదని
బీసీలకు న్యాయం చేయలేదని మరోసారి స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్ పేరుతో మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారన్నారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ బీసీలకు అన్యాయంగా ఉందని
ఎలాంటిబిసికార్పొరేషన్లుప్రకటించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు తీసుకొని ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తిస్తున్నామని సర్వే చేసి ఉచిత రేషన్ ఇందిరమ్మ ఇల్లు నిరుద్యోగ భృతి కింద మహిళలకు 2500 దరఖాస్తులు తీసుకొని ఇంతవరకు ఏ ఒక స్కీమాములు చేయలేదని ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి కాబట్టి మరోసారి బీసీలను మోసం చేయడానికిచేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారన్నారు
స్థానిక ఎన్నికల్లో లోపు ప్రభుత్వం ఎలాంటి షరతులు పట్టకుండా ఇచ్చిన హామీలు వెంటనే అమలుపరిచి స్థానిక ఎన్నికలకు పోవాలని లేకుంటే గ్రామాల్లో మహిళలు యువకులు నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం స్థానిక ఎన్నికల ద్వారా చెప్తారని వారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టకంగా ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార భద్రత పథకంతో 80 కోట్ల మందికి బియ్యం గోధుమలు పంపిణీ చేస్తుందని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నేరుగా నాలుగు కోట్ల పేదల సొంతింటి కల నెరవేరిందని అన్నారు. (Story : బీసీలను మోసం చేసే తెలంగాణ బడ్జెట్)