బిగ్ బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్: 30 మంది మావోయిస్టుల హతం
ఒక జవాన్ మృతి
భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
న్యూస్ తెలుగు/చింతూరు: మరోసారి మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెండు అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను కూడా మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఊచకోత కొనసాగుతున్న విషయం విదితమే. అయితే, ఓవైపు ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ఆదివాసీలు, హక్కుల కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు.


ఇక తాజా ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, సుకుమా, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని రహస్య సమాచారం అందడంతో గురువారం ఉదయం 7 గంటల నుండి డిఆర్‌జి, సిఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ముప్పేట విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గుట్టలపై మావోయిస్టులు పోలీసులను చూసి కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా కాల్పులు జరపడంతో 26 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో పొడియామి రాజు (35) అనే ఒక డిఆర్‌జి జవాను మరణించారు. సంఘటనా స్థలంలో ఏకే 47, ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, భారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఇలా ఉండగా కాంకేర్, నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో గంగలూరు, ఆండ్రి అడవుల్లో ఇదే రోజు జరిగిన మరొక ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. రెండు సంఘటనలోనూ మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను బీజాపూర్ జిల్లా ఎస్పీ జీతేంద్ర యాదవ్, బస్తర్ ఐజి సుందర్ రాజ్ పట్వా ధ్రువీకరించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు, విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 90 మంది మావోయిస్టులు మూడు ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి సాయి, డిప్యూటీ సీఎం శర్మ భద్రత దళాలను ప్రశంసించారు. 2026 మార్చ్ 31వ తేదీ వరకు దేశంలో మావోయిస్టులు అంతమవుతారని అమిత్ షా పేర్కొన్న అంశానికి ఈ ఎన్‌కౌంటర్లు దోహదపడుతున్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఘర్ వాపసి, నినాదంతో మావోయిస్టుల కుటుంబాలకు తమ కుటుంబ సభ్యులు దళాల్లో ఉంటే లొంగిపోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకపక్క విస్తృత గాలింపు చర్యలు నిర్వహిస్తూ, మరోపక్క మావోయిస్టుల లొంగుబాటు చర్యలు చేపడుతున్నారు. గురువారం సాయంత్రానికి ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం కూడా గాలింపు చర్యలు విస్తృతంగా చేపట్టడంతో మృతుల సంఖ్యలు పెరిగే అవకాశం ఉండొచ్చునని ఉన్నతాధికారులు తెలి పారు. (Story: బిగ్ బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్: 30 మంది మావోయిస్టుల హతం)
Follow the Stories:
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!