రవాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేర్ టౌన్ లో ఆటో క్యాబ్ డ్రైవర్లతో కలిసి నిరసన తెలియజేస్తున్న తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హోసన్న గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రవాణా రంగాన్ని రక్షించు కోవడానికి కార్మికుల సమస్యల పరిష్కరించడానికి ఈ నెల 24వ తారీఖు చలో పార్లమెంటును ఈనెల 21న చలో ఇంద్ర పార్క్ ధర్నాన్ని జయప్రదం చేయండి కేంద్ర రాష్ట్రా కమిటీ పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని రవాణా రంగాన్ని రక్షించుకోవడానికి కార్మికుల సమస్యలు పరిష్కరి నీకై తెలంగాణ రాష్ట్ర పిలుపుమేరకు రవాణా రంగ కార్మికులు ఆటో, కారు, డీసీఎం ,లారీ ,ట్రాలీ, మినీ డీసీఎం ,టాటా ఏసీ ,ట్రాక్టర్, అంబులెన్స్ ,స్కూల్ బస్సు ,ట్రక్కు, వరి కోత మిషన్ ,జెసిపి ,బోర్ బండి, టూరిస్ట్ బస్ ,ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్స్ ,క్లీనర్స్ ,మెకానికల్స్ అధిక సంఖ్యలో చలో పార్లమెంటు కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయాలి .అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 21వ తారీకు చలో ఇంద్ర పార్క్ ను జయప్రదం చేయాలి అన్నారు. కార్మికులు పని పగలనకా రాత్రి అన్నకా, ఎండ ,వాన ,చలి కాలంలో కూడా 24 గంటలు రోడ్లపైనే వాహనాలు నడిపేది డ్రైవర్స్ .ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహించవలసి వస్తుంది.వీరికి కనీస వేతనాలు ,చట్టబద్ధం సౌకర్యాలు ,సామాజిక సంక్షేమ చట్టం గాని లేవు . సంఘవిద్రోహశక్తులకు దాడులకు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి .నిత్యావసర సరుకులు ధరలు ఆకాశమంటినవి . విద్య వైద్య ఖర్చులు భరించలేనంతగా పెరిగాయి .కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదు అన్నారు.కార్మికులకు కొద్దిపాటు వెసులుబాటును కల్పించే కార్మిక చట్టాలు కూడా రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లను తెచ్చింది .సంఘం ఏర్పాటు చేసుకుని హక్కు భైరసాలు హక్కు సమ్మె హక్కు ను హర్షించి తలపెట్టింది .ఈ కో కోడులో కోడ్ ల అమలుకు ప్రభుత్వం త్రీవ సన్నాహాలు చేస్తుంది .అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గని నీయంగా తగ్గిన మన దేశంలో పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ధరల ను కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచింది.ఈనెల భవన నిర్మాణ కార్మికులు పోరాడి బెల్ ఫర్ బోర్డును సాధించుకున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నుముక గా ఉన్న రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం ఇంతవరకు లేదు. అదేవిధంగా హమాలీ కార్మికుల సామాజిక సంక్షేమ చట్టం ఇంతవరకు లేదు అన్నారు వివిధ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నా ను జయప్రదం చేయాలని ఆటో ట్రాలీ కార్మికులు మన్యం, మధు, మాధవ్, భాస్కర్ శ్రీను ,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు . (Story : రవాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి)