ప్రభుత్వ ఆసుపత్రి మహిళా ఉద్యోగి మృతి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ రాయబారం సుమలత 57 ఏబీఎన్ కాంపౌండ్ నందు ఆమె స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ప్రస్తుతం కొచ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్ పి.హెచ్.సి నందు ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు. మరియు ఈమె వినుకొండ పట్టణంలోని ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఫోను ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కొచ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ సిరివెన్నెల తోటి సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.(Story : ప్రభుత్వ ఆసుపత్రి మహిళా ఉద్యోగి మృతి )