విజన్-2020 విజయమే 2047 స్వప్నం సాకారానికి స్ఫూర్తి
స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యుమెంట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో విజన్ -2020 ద్వారా సాధించిన విజయాలే 2027 స్వప్నం సాకారానికి స్ఫూర్తి అని ప్రభుత్వ చీఫ్‌వి ప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబుకు – జగన్‌కు బాధ్యతగల తండ్రి ప్రణాళికలు, తాగుబోతు కొడుకు చేసిన దివాళాకోరు పనులకు ఉన్నంత తేడా ఉందని, అది ప్రజలు ఇప్పటికే గమనించారని ఎద్దేవా చేశారు. ప్రజల భాగస్వామ్యం, ఎన్డీయే ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వంతోనే విజన్-2047 తప్పక నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. సోమవారం అసెంబ్లీలో ఈ మేరకు జరిగిన చర్చలో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం ఆకాంక్ష. చంద్రబాబు ఆశయం ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో 2047 కల్లా అన్ని రంగాల్లో నంబర్-1గా నిలబడాలన్న లక్ష్యం సాధించడమే అన్నారు. పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న ఇంటికో పారిశ్రామికవేత్త నినాదం తప్పక ఫలితాలు ఇస్తుందని తెలి పారు. చంద్రబాబు అప్పట్లో విజన్-2020 అంటే కొందరు నమ్మలేదని, కంప్యూటర్లు అన్నం పెడ తాయని అనుమానం వ్యక్తం చేసిన వారికి సైబరాబాద్ అభివృద్ధే ఒక నిదర్శనమన్నారు. 1996 లో ఉమ్మడి ఏపీ ఐటీ ఆదాయం రూ.5వేల కోట్లు ఉంటే 2023-24లో హైదరాబాద్ నుంచి 2.7లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయన్నారు. ప్రతి రైతు కుటుంబం నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వచ్చారని.. వారంతా దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. అమెరికా తలసరి ఆదాయం 60వేల డాలర్లుగా ఉంటే… అక్కడ స్థిరపడిన తెలుగువారి తలసరి ఆదాయం లక్షా 20వేల డాలర్లని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీకి 2047లో తలసరి ఆదాయం రూ.35లక్షలు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారని.. తప్పక సాధిస్తామన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ సర్వనాశనం చేశాడని ఆ కలలన్నీ ఇప్పుడు తిరిగి సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ చేసిన తప్పిదాలు, ఆలస్యంతో పోలవరం, అమరావతి నిర్మాణ వ్యయం వేల కోట్లు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుల ఆదాయం నంబర్-1 స్థానంలో ఉంటే జగన్ ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలిపారన్నారు. నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం నాడు నాణ్యమైన విద్యలో ఏపీ 3వ స్థానంలో ఉంటే… జగన్ 19వ స్థానానానికిపడేశారన్నారు. పట్టిసీమ ద్వారా రూ. 50వేల కోట్ల దిగుబడులు సాధిస్తే దాన్నీ కూడా ఆపేశారని వాపోయారు. నాడు రూ. 5లక్షల కోట్ల పెట్టుబడులతో 5.14 లక్షల ఉద్యోగాలు కల్పించామని, అప్పట్లో 4శాతం ఉన్న నిరుద్యోగాన్ని జగన్ 24శాతానికి చేర్చారన్నారు. అందు కే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్న ఈ తేడాను గమనించి ప్రజలు ఎన్డీయేతోనే ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్ స్వప్నం తప్పక సాధించితీరతామన్నారు. దుర్మార్గులకి అవకాశం ఇవ్వకూడదని సూచించారు. చంద్రబాబు తలపెట్టిన నాలెడ్జ్ ఎకానమీ ద్వారా లక్షల ఉద్యోగాలు. 5 నదుల అనుసంధానంతో 30లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని.. ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్‌తో పాటు సంపన్నరాష్ట్రంగా దేశంలోనే నంబర్-1 గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. (Story: విజన్-2020 విజయమే 2047 స్వప్నం సాకారానికి స్ఫూర్తి)