మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ , ఎన్నిసార్లు ఫిర్యాదు ప్రజావాణిలో చేసిన ఫిర్యాదులపై కదలిక లేదని ఐక్యవేదిక నాయకులు కలెక్టర్ కు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదులు అటకెక్కుతున్నాయనీ. ప్రతివారం చేస్తున్న ఫిర్యాదుల్లో కదలిక లేదనీ. తెలుపుతూ మున్సిపాలిటీలో చికెన్ వ్యర్ధాల డబ్బులు ఎందుకు వసూలు చేయలేదని, ముఖ్యంగా తిరుమల్ రెడ్డి వ్యవహారంలో డబ్బులు ఎందుకు వసూలు చేయలేదని, దానివల్ల ప్రజలు కట్టిన పన్నులు బిల్లులో మళ్లీ వస్తున్నాయని, వారిని మెడలు వంచి వసూలు చేస్తున్నారని, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వనపర్తి లో కడుతున్న అక్రమ కట్టడాలపై, అక్రమ పార్కింగ్ లపై షాపింగ్ మాల్ ముందు అక్రమ పార్కింగ్ పై ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే వాటిపై చర్యలు తీసుకోకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని లేదా H.R.C నీ , ఆపై హైకోర్టును ఆశ్రయిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ నాయకులు గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, బీఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, బిజెపి నాయకులు రవి, శివకుమార్, మోహన్ గౌడ్, రాములు,నరసింహ తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలి)