రైతులను కాపాడలన్న చిత్తశుద్ధి, ధ్యాస,స్పృహ ప్రభుత్వానికి లేదు
ఎండిన పంటలను పరిశీలించి బాధితులను ఓదార్చిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్దగూడెం తండాలో గిరిజన రైతు జూలనాయక్ వేసిన 3ఎకరాల వరిపంట కరెంట్ కోతలతో సరియైన నీళ్ళు లేక ఎండిపోయిన పంటను పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నిత్యం కె.సి.ఆర్ గారిని నిందించడం తప్పా రైతులను,ప్రజలను ఆదుకోవాలన్న ధ్యాస, స్పృహ,చిత్తశుద్ధి లేదని అన్నారు. రైతులు సాగునీళ్ళు లేక,కరెంట్ కోతలతో,రైతు బంధు రాక హరిగోసా పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం 3ఎకరాలకు రైతు బంధు ఇచ్చామని చెప్పడం బూటకమని ఇందుకు నిదర్శనం జులనాయక్ అని ఈ రాష్ట్రములో 3ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు కె.సి.ఆర్ గారు రైతు బంధు ఇస్తే 67లక్షల 30వేల ఎకరాల రైతులు లబ్ధి పొందారని అన్నారు.
ఈ ప్రభుత్వము లెక్కల ప్రకారం 3ఎకరాలకు రైతు బంధు ఇచ్చామని అంటున్నారు వాళ్ళ లెక్కల ప్రకారమే 58లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే మిగతా 9లక్షల 30వేల ఎకరాలకు వివిధ కారణాలతో రైతు బంధు ఎగ్గోట్టినారని అని అన్నారు. జూలా నాయక్ కుమారుడు కుమారుడు హైదరబాద్ నందు ఆటో నడుపుతూ జీవనం సాగించారని ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకంతో అతని బ్రతుకు రోడ్డుమీద పడిందని భార్యతో కలసి వరి సాగు చేస్తే కరెంట్ కోతలతో ఎండిపోయిందని రాష్ట్రవ్యాప్తంగా రైతుల దీనస్థితి ఈ విధంగానే ఉందని ప్రభుత్వం ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థికమంత్రి,కరెంట్ మంత్రి,వ్యవసాయ మంత్రి సమన్వయంతో పనిచేసిఉంటే 448 మంది రైతుల ఆత్మహత్యలు జరిగేవా…లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోఎవా…. రైతు బంధు రాక రైతులు గోసపడేవారా అని ఎద్దేవా చేశారు. నిరంజన్ రెడ్డి వెంట మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం,ధర్మా నాయక్,కృష్ణా నాయక్,చిట్యాల.రాము, చంద్రశేఖర్,నారాయణ్ నాయక్, టీక్య నాయక్, రూప్లా నాయక్, తదితరులు ఉన్నారు. (Story : రైతులను కాపాడలన్న చిత్తశుద్ధి, ధ్యాస,స్పృహ ప్రభుత్వానికి లేదు)