రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11,000 కోట్ల రుణం
న్యూస్‌తెలుగు/అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో –సిఆర్డిఎ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సిఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22 న ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు నేడు సిఆర్డిఎతో ఒప్పందం చేసుకున్నారు. (Story: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11,000 కోట్ల రుణం)