ప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం..
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను ప్రజలందరూ నిషేధించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో గల హర్ష స్కూల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జివి ప్రజల ఉద్దేశించారు మాట్లాడుతూ. ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని, 100 మైగ్రేన్ ఉన్న ప్లాస్టిక్ భూమిలో కరగకపోవటంతో కాలుష్యం పెరుగుతుందని, త్రాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్య పాలవడం, ఆవులు, అనేక జీవ ప్రాణులు మరణిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకం వచ్చే కాలుష్యంతో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ప్రజలందరూ ఐక్యంగా ప్లాస్టిక్ వాడకండి నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. వినుకొండ ప్రాంతంతో పాటు పల్నాడు జిల్లాలో వ్యాపారులందరూ ప్లాస్టిక్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ నియంత్రణలో ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ కలిసి ప్లాస్టిక్ వాడకం నియంత్రించి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పీవి సురేష్ బాబు, షమిం, పి. అయూబ్ ఖాన్, కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. (Story : ప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. )