కారల్ మార్క్స్ 142 వ వర్ధంతి సభ
న్యూస్‌తెలుగు/వనపర్తి : మార్చి 14న కారుల్ మార్క్స్ 142 వ వర్ధంతి సభ సిఐటియు జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి అధ్యక్షత వహించారు. కారల్ మార్క్స్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. జబ్బార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్ . డి. జబ్బార్ ప్రసంగిస్తూ కారల్ మార్క్స్ 1818 మే 5న జర్మనీ దేశంలో ట్రైర్ పట్టణంలో జన్మించి 18 23 మార్చి 14న మరణించారు . నేటికీ కారల్ మార్క్స్
మరణించి 142 సంవత్సరాలు అవుతుంది . కారల్ మార్క్స్ రచనలు 1848 లో కమ్యూనిస్టు ప్రణాళిక, 1867 లో దాస్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథాలు ప్రపంచ పెట్టుబడిదారులను ఉలిక్కి పడేలా చేశాయి. కమ్యూనిస్టు ప్రణాళిక 1848లో ఫిబ్రవరి 21న మొట్టమొదటిసారిగా విడుదలైంది. నాటి నుండి నేటి వరకు కేవలం 177 సంవత్సరాలయింది. ఈ కాలంలో కారల్ మార్క్స్ ప్రపంచాన్ని పరిపరి విధాలుగా తత్వవేత్తలు వ్యాఖ్యానించారు, విశ్లేషించారు. కానీ దానిని చలన సూత్రాల ఆధారంగా మార్చడమే కమ్యూనిస్టుల పని అని కార్యాచరణను ప్రపంచానికి కారల్ మార్క్స్ అందించారు. మార్క్స్ మరణించి 142 ఏళ్ళయినా ప్రపంచమంతా కారల్ మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. బాల్ రెడ్డి, ఏ లక్ష్మి సిపిఎం పట్టణ నాయకులు డి. కురుమయ్య, జి. బాలస్వామి, గంధం గట్టయ్య, నందిమల్ల రాములు, బిసన్న, రత్నయ్య, కృష్ణ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు . (Story : కారల్ మార్క్స్ 142 వ వర్ధంతి సభ)